గుర్తు తెలియని శవం లభ్యం 

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్

మండల కేంద్రంలోని డంపింగ్ యార్డ్ సమీపాన గుర్తు తెలియని శవం లభించిందని హెడ్ కానిస్టేబుల్ మురళీకృష్ణ తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దకొడప్ గల్ గ్రామ శివారులో డంపింగ్ యార్డ్ వద్ద గుర్తుతెలియని శవం పడి ఉన్నట్లు స్థానికులు సమాచారం  తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకున్నారు వృత్తిడి వయసు 30 సంవత్సరాల ఉంటుందని  మృతిడి ఒంటిపై ఎరుపు కలర్ చొక్కా నల్ల కలర్ నిక్కర్ తో మృతుడు ఉన్నట్లు ఆయన తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నట్టు తెలిపారు.