నవతెలంగాణ- పిట్లం: అంగన్వాడీ ఉద్యోగుల డిమాండ్ల సాధనకై బుధవారము హైదరాబాద్ పట్టణంలోని సుందరయ్య పార్క్ కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగులు మాట్లాడుతూ తమ డిమాండ్ల పరిష్కారం నిమిత్తం రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపుమేరకు సమ్మె చేపట్టిన ప్రభుత్వ స్పందన కరువవడంతో రాష్ట్ర రాజధానికి తరలి వెళ్లామన్నారు. ప్రభుత్వము తక్షణమే స్పందించి అంగన్వాడి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, 26వేల వేతనము అందజేసి పీఎఫ్ , ఈఎస్ఐ సౌకర్యాలను కల్పించాలని వారు డిమాండ్ చేశారు. తరలి న వారిలో కుమ్మరి రాధా, అన్నారం అనురాధ, జంగం సుమలత, సుజాత, కారేగావ్ అనురాధ సుజాత, జగదీశ్వరి, గౌరవ్వ, పార్వతి, గంగామణి, శోభ, విజయలక్ష్మి, బాలామణి, జయంతి తదితరులు ఉన్నారు.