
నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. శుక్రవారం తొర్రూర్ ఐసిడిఎస్ ఆఫీసులో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ తోరూర్ ప్రాజెక్ట్ కమిటీ ఆధ్వర్యంలో సిడిపిఓ కు సెప్టెంబర్ 11వ తేదీ సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అనంతరం యూనియన్ నాయకులు పసుల స్వరూప, లక్ష్మీ నరసమ్మ లు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో సుమారు 70 వేల మంది అంగన్వాడీ ఉద్యోగులు పనిచేస్తున్నారని వారంతా బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలు కాబట్టి 45 సంవత్సరాలుగా ఐసిడిఎస్సి లో పనిచేస్తూ పేదలకు సేవలు అందిస్తున్న కూడా కనీసం వీరికి వేతనం పెన్షన్ ఈఎస్ఐ ఉద్యోగ చట్టబద్ధ సౌకర్యాలేవి ప్రభుత్వం కల్పించకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మన పక్కనే ఉన్న తమిళనాడు పాండిచ్చేరి రాష్ట్రాల్లో అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. మిగతా రాష్ట్రాల్లో హెల్త్ కార్డులు రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ పండగ బోనస్ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు కాని తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అంగన్వాడీలను గుర్తించకుండా, అంగన్వాడీలతో పెట్టి చాకిరి చేయించుకుంటున్నారని అన్నారు. మిగతా కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినట్టుగా అంగన్వాడీలను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆగస్టు 25న ఐసిడిఎస్ మంత్రి సత్యవతి రాథోడ్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అతి తక్కువ రిటర్మెంట్స్ బెనిఫిట్స్ నిర్ణయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 17వ తేదీ నుండి తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్నట్టు సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శైలజ, సుకన్య మంజుల రేణుక తదితరులు పాల్గొన్నారు.