చిన్నారులతో అంగన్వాడి ఉద్యోగుల నిరసన

నవతెలంగాణ- ( వేల్పూర్ )ఆర్మూర్

మాకు పోషక ఆహారం కావాలి.. అంగన్వాడి సెంటర్లను తెరిపించండి… అంటూ చిన్నారులు అంగన్వాడి ఉద్యోగుల నిరసనలో తెలిపారు. వేల్పూర్ మండల తహసిల్దార్ కార్యాలయం ముందు ఆదివారం జరిగిన నిరసన కార్యక్రమంలో చిన్నారులు నివేదిత ,అక్షర ,సాన్విక, ప్రసన్న, శ్రీనిత, అద్విత్ లు అన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడి అధ్యక్షురాలు వసంత, స్వరూప లు మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం 10వ తరగతి అర్హత ఉన్న హెల్పర్లకు ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని, ఐసిడిఎస్ బడ్జెట్ పెంచి బలోపేతం చేయాలని ,కనీస వేతనం 26 వేలు,, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు ,ఆయాలు తదితరులు పాల్గొన్నారు..