14వ రోజు కొనసాగిన అంగన్‌వాడీ ఉద్యోగుల సమ్మె

నవతెలంగాణ-పరిగి
పరిగి పట్టణ కేంద్రంలో ఆదివారం అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మె 14వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడుతూ.. అంగన్‌వాడీల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరిం చాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీ ఉద్యోగులు 14 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. చాలీచాలని జీతాలతో అంగన్‌వాడీలు బతుకు లు ఈడుస్తున్నారని అన్నారు. అంగన్‌వాడీ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లిం చాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ టీచర్‌కు రూ.10 లక్షలు, హెల్పర్‌కు రూ.5 లక్షలు ఇవ్వాలని, చివరి జీవితంలో సగం పింఛన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.