– తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్,హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ)
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అంగన్‌వాడీ ఉద్యోగులకు మంత్రులు ఇచ్చిన హామీ ప్రకారం 24రోజుల సమ్మెకాలం వేతనాలు చెల్లించాలని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్,హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె సునీత,పి జయలక్ష్మి, కోశాధికారి పి మంగ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. సెప్టెంబర్ 11నుంచి అక్టోబర్ 4వరకు తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీలు నిరవధిక సమ్మె చేశారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్ సమ్మెలో ఉన్న జేఏసీ నాయకత్వంతో చర్చలు జరిపారనీ, సమస్యలు పరిష్కరిస్తామనీ, సమ్మెకాలం వేతనాలు ఇస్తామంటూ హామీ ఇచ్చారని తెలిపారు.సమ్మెకాలం వేతనం హామీని అమలు చేయలేదని తెలిపారు. వెంటనే ఆ వేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు.