– ప్రభుత్వం జీవో వచ్చాక సమ్మె చేయడమేంటి? : మంత్రి సత్యవతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అంగన్‌వాడీలకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మహిళాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో ఆమె విలేకర్లతో మాట్లాడారు. అంగన్‌వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు. రెగ్యులర్ చేయాలనే డిమాండ్ కేంద్రం పరిధిలోనిదని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వారి తరుపున లేఖ రాస్తామని చెప్పారు. అవసరమైతే కేంద్ర మంత్రులను స్వయంగా కలుస్తామన్నారు. తక్షణం అందరూ విధులకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. అంగన్‌వాడీలకు సంబంధించిన పలు అంశాలపై ప్రభుత్వం జీవో విడుదల చేసిన తర్వాత వారు సమ్మెను కొనసాగించటమేంటని ప్రశ్నించారు.