భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడిగా మండల కేంద్రానికి చెందిన నూనె అనిల్ యాదవ్ ను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు గంట రవి కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికైన అనిల్ యాదవ్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి ఏబీవీపీ మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అనేక కార్యక్రమాలు చేపట్టి బాధ్యత యుత స్థాయిలో సేవలందించినట్లు తెలిపారు. ముఖ్య కార్యకర్తగా ఉంటూ విద్యార్థులను సంఘటితం చేస్తూ విద్యార్థుల సమస్యలపై పోరాటం చేయడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ఎప్పటికప్పుడు ఎండగాడుతూ పార్టీ బలోపేతం కోసం కష్టపడినట్లు తెలిపారు. తనపై నమ్మకంతో మండల బాధ్యతను అప్పగించిన జిల్లా అధ్యక్షుడు గంట రవి కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లేగ రామ్మోహన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కర్ర శ్రీనివాస్ రెడ్డి, ఎస్సి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, నియోజకవర్గ కన్వీనర్ పూసల శ్రీమాన్, జిల్లా నాయకుడు గడ్డం నరేందర్, బీజేవైఎం నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదలు తెలిపారు.