హైదరాబాద్ : తుంటి ఎముక శస్త్రచికిత్స అనంతరం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో కోలుకుంటున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును శాట్స్ మాజీ చైర్మెన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ గురువారం పరామర్శించారు. వేగంగా కోలుకుని తెలంగాణ ప్రజల పక్షాన అసెంబ్లీలో వాణి వినిపించాలని ఈ సందర్భంగా ఆంజనేయ గౌడ్ ఆకాంక్షించారు.