స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ అగ్నిప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు

– రూ. ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా
– ప్రకటించిన సీఎం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదం పట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం జరగటంతో పాటు, పలువురు గాయపడడం పట్ల విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరణించివారికి రూ.5 లక్షల ఎక్స్‌ గ్రేషియాను ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలతో పాటు, గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో వుండి పరిస్థితులను పరిశీలిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా హౌం మంత్రి మహమూద్‌ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు సీఎం కేసీఆర్‌ సూచించారు.

Spread the love