హనుమాన్ ఫారంలో అన్నదానం

నవతెలంగాణ –  నవీపేట్

అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా మండలంలోని హనుమాన్ ఫారం హనుమాన్ ఆలయంలో సోమవారం  ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వంశీ మోహన్, మోహన్ రావు, ఉప సర్పంచ్ నర్సింహ రెడ్డి, బుల్లి రాజు, పూర్ణచంద్రరావు, రత్నాకర్ చౌదరి, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.