హిందూ దళ్ వినాయకుని దగ్గర అన్నదానం

Annadanam near Hindu Dal Vinayakaనవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూరు పట్టణ కేంద్రంలోని హిందూ దళ్ వినాయక మండపం వద్ద శనివారం అన్నదాన కార్యక్రమాన్ని సంఘం సభ్యులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా ఎస్సై సాయికుమార్ పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత ఎలాంటి గొడవలు జరగకుండా పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హిందూ దళ్ సభ్యులు పాల్గొన్నారు.