అమెరికాఅధ్యక్ష రేసులో మరో భారత సంతతివ్యక్తి

వాషింగ్టన్‌: 2024లోజరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలబరిలో మరో భారత సంతతి వ్యక్తినిలిచారు.ఇంజినీర్‌అయిన హర్ష్‌వర్దన్‌ సింగ్‌2024 అధ్యక్షఎన్నికల్లో రిపబ్లికన్‌పార్టీ తరపున పోటీ చేయదలచుకున్నట్లుగురువారం ప్రకటించారు.ఆమేరకు తన అభ్యర్థిత్వాన్ని ఫెడరల్‌ ఎలక్షన్‌ కమిషన్‌వద్ద నమోదు చేసుకున్నారు.ఇప్పటికేఇద్దరు భారతీయ అమెరికన్లునిక్కీహేలీ(51), వివేక్‌రామస్వామి(37)ఈబరిలో ఉన్న విషయం తెలిసిందే.అయితే,ఈముగ్గురు కూడా రిపబ్లికన్‌పార్టీ తరఫున పోటీకి దిగేందుకుప్రయత్నిస్తుండడం గమనార్హం.ఈపార్టీకే చెందిన అమెరికామాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ మళ్లీ పోటీ చేస్తాననిప్రకటించిన విషయం తెలిసిందే.అధ్యక్షపదవికి పోటీ చేసే అభ్యర్థులవిషయంలో రిపబ్లికన్లలో తీవ్రపోటీ నెలకొన్న విషయం దీంతోస్పష్టమవుతోంది.ఆపార్టీ అభ్యర్థిగా పోటీలోఎవరు ఉండాలో రిపబ్లికన్లజాతీయ సదస్సుతేల్చనున్నది.