దళారులను నమ్మి మోసపోవద్దు: ఏపీఎం రమణా చారి

నవతెలంగాణ- పెద్దవంగర: దళారులను రైతులు నమ్మి మోసపోవద్దని ఏపీఎం రమణా చారి సూచించారు. గురువారం మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో శ్రీవాణి గ్రామ ఐక్య సంఘం సహకారంతో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు రాకుండా సహకార సంఘం ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో సీసీ పద్మ, వీఓఏలు రఘుపతి, వసంత, మణెమ్మ,  గ్రామ సంఘాల ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.