న్యూయార్క్ : మానవుల ప్రమేయం లేకుండా సమాచార మార్పిడికి వీలుగా కృత్రిమ మేధా (ఎఐ) పరిశోధనలను టెక్ కంపెనీలు పోటాపోటీగా నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా లాంటి కంపెనీలు ఒక అడుగు ముందుకు వేయగా.. తాజాగా ఆపిల్ కంపెనీ కూడా జిపిటి ఎఐని ఆవిష్కరణకు కసరత్తు చేస్తోందని సమాచారం. తన కీలక డేటా సురక్షితంగా ఉండేందుకు ఆపిల్ తన ఉద్యోగులను చాట్‌జిటిపి వంటి ఎఐ టూల్స్‌ను వాడేందుకు అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలోనే తమకంటూ ప్రత్యేకంగా ఎఐ టూల్స్ ఉండాలనే ఉద్దేశ్యంతో కసరత్తు చేస్తోందని.. ఈ క్రమంలోనే సొంత జిపిటి ఎఐని తీసుకొస్తుందని బ్లూమ్‌బర్గ్ ఓ రిపోర్ట్‌లో పేర్కొంది.