ముంబయి : స్టాక్ మార్కెట్ల రెగ్యూలేటరీ అయినా సెక్యూరిటీస్ అండ్ ఎక్పేంజీ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) కొత్త చీఫ్ కోసం కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను అహ్వానిస్తోంది. ప్రస్తుత వివాదస్పద చైర్‌పర్సన్ మాధాబి పురి బచ్ పదవీ కాలం ఫిబ్రవరి 28తో ముగియనుంది. కార్పొరేట్లతో మాధాబి అంటకాగారాని.. పరస్పర ప్రయో జనాలకు పాల్పడ్డారని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ గతేడాది ఓ రిపోర్ట్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. మాధాబీ పదవీ కాలం ఫిబ్రవరి 28తో ముగియనుంది. సెబీ ఛైర్‌పర్సన్ కోసం ఆసక్తి కలిగిన వారు ఫిబ్రవరి 17 లోపు దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర ఆర్ధిక శాఖ సూచించింది. 50ఏండ్లపై బడిన వారు 25 ఏండ్ల అనుభవం కలిగిన వారు ఈ పోస్టుకు అర్హులని తెలిపింది. న్యాయ, ఫైనాన్స్, ఆర్థిక, అకౌంటెన్సీలో ప్రత్యేక పరిజ్ఞానం కలిగి ఉండాలని పేర్కొంది. సెబీ చైర్‌పర్సన్ పదవికి ఇబ్బంది కలిగించేలా ఆర్థిక, ఇతర ప్రయోజనాలు పొందుతూ ఉండ కూడదని కేంద్రం తెలిపింది.