క్రీడా శిక్షకుల కోసం దరఖాస్తులు..

– గిరిజన సంక్షేమ శాఖ ఆహ్వానం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గిరిజన సంక్షేమ మోడల్‌ క్రీడా పాఠశాలల్లో కోచింగ్‌ ఇచ్చేందుకు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ఆ శాఖ అదనపు డైరెక్టర్‌ డి సుధాకర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏహెచ్‌ఎస్‌ బాలురు కిన్నెరసాని, ఏహెచ్‌ఎస్‌ బాలికలు కాచనపల్లి, ఏహెచ్‌ఎస్‌ బాలురు కొత్తగూడ, వాటర్‌ స్పోర్ట్స్‌ అకాడమి ఏహెచ్‌ఎస్‌ బోయినపల్లిలో ఔట్‌ సోర్సింగ్‌ పద్దతిలో కోచ్‌లుగా పనిచేయటానికి దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 2023-24 సంవత్సరానికిగాను ఆర్చెరీ, వాలీబాల్‌, బాస్కెట్‌ బాల్‌, ఫెన్సింగ్‌ల్లో ఏడాదిపాటు ఎన్‌ఎస్‌,ఎన్‌ఐఎస్‌ డిప్లొమా కోర్సు పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. sportsofficertwd@gmail.com  వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి చేసిన ఫారాలను రెజ్యూమ్‌తో పాటు రజూశీత్‌ీరశీటళషవత్‌ీషసఏస్త్రఎaఱశ్రీ.షశీఎ మెయిల్‌కు, అకడమిక్‌ సెల్‌, కమిషనర్‌ కార్యాలయం, గిరిజన సంక్షేమ శాఖ, మాసబ్‌ ట్యాంక్‌, హైదరాబాద్‌ నందు సమర్పించాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 12 తుది గడువనీ, ఆరోజు సాయంత్రం 5.00 గంటల వరకు అప్లికేషన్లను సమర్పించాలని తెలిపారు. వివరాల కోసం 9908550250, 9247267050 నెంబర్లకు సంప్రదించాలని సూచించారు.