
తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని బిజెపి పార్టీ నాయకులు తాసిల్దారుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రజలకు రెండు పడకల ఇళ్ల నిర్మాణాలను చేపట్టి ఇస్తామని ఇంతవరకు రెంజల్ మండలంలో ఒక్క కుటుంబానికి కూడా ఇవ్వలేదని వారు విమర్శించారు. సొంత స్థలం ఉన్నవారికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించి, ప్రస్తుతం గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారని, ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన కుట్ర అని వారు విమర్శించారు. మళ్లీ గృహలక్ష్మి పథకం ప్రవేశపెట్టి కేవలం మూడు రోజుల్లోనే ముగించారని, ఈ పథకాన్ని నిరంతరం కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు గోపికృష్ణ, రెంజల మండల ఉపాధ్యక్షులు ఖ్యాతం యోగేష్, ప్రకాష్, సాయినాథ్, ప్రసాద్, యువత తదితరులు పాల్గొన్నారు.