నవతెలంగాణ పెద్దవంగర: ‘గృహలక్ష్మి’ పథకం అమలులో భాగంగా అర్హులు ఈ నెల 10 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆగస్టు 10వ తేదీ లోపు వచ్చిన దరఖాస్తుల జాబితాను రూపొందించి, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయి విచారణ చేపడతామన్నారు. అనంతరం ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం ఆహార భద్రత కార్డు ఉన్నవారికి, సొంత ఇల్లు లేని వారికి, ప్రభుత్వ జీవో 59 కింద లబ్ధి పొందని వారిని ఎంపిక చేయనున్నట్లు వివరించారు. ఈనెల 25 వరకు గృహలక్ష్మి పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని, ఎటువంటి మధ్యవర్తులు నమ్మి మోసపోవద్దని స్పష్టం చేశారు.