స్టాఫ్ నర్స్, పీఈటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

నవతెలంగాణ – పాల్వంచ 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని మైనార్టీ గురుకుల బాలికల కళాశాలలో ఖాళీగా వున్న స్టాఫ్ నర్స్, పి.ఈ.టి పోస్టులకు అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ షేక్.బిపాషా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్టాఫ్ నర్స్ పోస్టుకు బీఎస్సీ నర్సింగ్ లేదా జి.ఎన్.ఎం, పి.ఈ.టి పోస్టుకు బీపీఈడి లేదా ఎంపీఈడి విద్యార్హత కలిగి ఉండి, కనీసం మూడు సంవత్సరాల అనుభవం కలిగిన వారు అర్హులని అన్నారు. దరఖాస్తుదారులు తమ వెంట బయోడేటాతో పాటు విద్యార్హత నకలు, అనుభవం సర్టిఫికెట్ నకలు, ఆధార్ కార్డు నకలు, రెండు పాస్ ఫోటోలతో   ఈనెల 4వ తేదీ నుండి 6వ తేదీ వరకు నేరుగా కళాశాల పని దినాలలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4.30 నిమిషాల వరకు కిన్నెరసాని రోడ్డు నందు గల మైనారిటి గురుకుల బాలికల కళాశాలలో హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు 89194 03948, 9581786989 లకు సంప్రదించాలని కోరారు.