పి ఆర్ సి కమిటీని నియమించండి..

– ఎస్ టి యు టి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం పర్వతారెడ్డి
నవతెలంగాణ – కంటేశ్వర్
పి.ఆర్.సి కమిటీ నియమించండి అని ఎస్ టి యు టి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం పర్వతారెడ్డి కోరారు ఈ మేరకు గురువారము నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వత రెడ్డి మాట్లాడుతూ 1 జూలై 2023 నుంచి కొత్త పి ఆర్ సి అమలు చేయాలి కావున వెంటనే పి ఆర్ సి కమిటీని ఏర్పాటు చేసి, మధ్యంతర భృతి ని ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అదేవిధంగా గత సంవత్సరం కాలంగా పెండింగ్ లో ఉన్న బిల్ల్స్ ను వెంటనే చెలించలని,పెండింగ్ డి ఎ లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.పాఠశాలలు పునఃప్రారంభం నాటికి ఏకరూప దుస్తులు,బుక్స్,విద్యార్థులకు అందిచేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కేజీబీవీ బదిలీలలో లాంగ్ స్టాండింగ్ తీసుకోవాలని,అన్ని ఖాళీలను చూపించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్,ప్రధాన కార్యదర్శి ధర్మేందర్, రాష్ట్ర సెక్రెటరీ పోల్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి రమేష్, జిల్లా ఉపాధ్యక్షలు శ్రీనివాస్ జిల్లా మండల కార్య వర్గ సభ్యులు పాల్గొన్నారు.