శ్రీ సంతోషిమాత దేవాలయ పాలకమండలి నియామకం

– నూతన పాలక మండలికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ – సిద్దిపేట
సిద్దిపేట పట్టణం లో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ సంతోషి మాత దేవాలయం నూతన పాలక మండలి నియామకమును మంత్రి హరీష్5 రావు శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం భక్తులతో కిటకిటలాడే, ఆడపడుచుల ఇష్ట దైవం శ్రీ సంతోషి మాత ఆలయం అని, నూతన పాలక మండలి ఏర్పాటు కావడం చాలా సంతోషం అని, ఈ సందర్భంగా పాలక వర్గాన్ని అభినందిస్తు, శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక సేవలో నూతన పాలక వర్గం కృషి చేయాలని అన్నారు. మాంకాల నవీన్ – చైర్మన్, గాదగోని సత్యనారాయణ గౌడ్, కాముని ప్రభాకర్, కోమర వెళ్లి కల్యాణి, చకిలం ఆమరనాథ్, గరిపల్లి సువర్ణలు సభ్యులుగా నియమించినట్లు తెలిపారు.
ఎక్స్ అఫిషియో మెంబర్ గా ఆలయ పూజారి మధు సుధన్ రావు ఉంటారనీ తెలిపారు.