నవతెలంగాణ-జక్రాన్ పల్లి: సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షునిగా కొప్పు రాజేందర్ ను నియమించినట్టు జిల్లా అధ్యక్షులు దత్తాత్రేయ గౌడ్ తెలిపారు. సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ దేశానుసారం. జిల్లా అధ్యక్షులు బట్టి దత్తాద్రి గౌడ్, జిల్లా చైర్మన్ డాక్టర్ సుధాకర్ ల అధ్యక్షతన ముఖ్య అతిథులుగా విచ్చేసిన నేషనల్ జనరల్ సెక్రెటరీ మామిడాల మనోహర్, సౌత్ ఇండియన్ చైర్మన్ గంప హనుమ గౌడ్, తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ మాలేపు నారాయణల చేతుల మీదుగా జక్రాన్ పల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కొప్పు రాజేందర్ ముదిరాజ్, సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షునిగా నియమిస్తూ నియమిత పత్రాన్ని గుర్తింపు కార్డును అందజేశారు. ఈ సందర్భంగా కొప్పు రాజేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో జిల్లా అధ్యక్షునిగా నియమించిన నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.
రాజ్యాంగం కల్పించిన హక్కులు ప్రతి ఒక్కరికి అందే విధంగా మానవ హక్కుల పరిరక్షణ కొరకు అణగారిన వర్గాల ప్రజల కొరకు నిరంతరం కష్టపడుతూ ప్రభుత్వానికి మరియు అధికారులకు సహకారంగా ఉంటూ చట్టాల పరిరక్షణ మానవ హక్కుల కొరకు ఎటువంటి స్వార్థం లేకుండా అంతకరణ శుద్ధితో పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ డాక్టర్ ఎన్ రామ గౌడ్, సుర్పిర్యాల ప్రసాద్, బోధన్ కాంసెన్సీ చైర్మన్ సాయి సుభాష్, మధుకర్ చంద్రకాంత్ రెడ్డి, అన్నపూర్ణ నీలకంఠం, శివ, వివిధ మండల చైర్మన్లు పాల్గొన్నారు.