నవతెలంగాణ- డిచ్ పల్లి: తెలంగాణ యూనివర్సిటీలో రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ ఆదేశాల మేరకు ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరద బట్టు వేణు రాజ్ సమక్షంలో ఎన్.ఎస్.యు.ఐ తెలంగాణ యూనివర్సిటీ నూతన కమిటీ ని ఎంపిక చేసి నియామక పత్రాలను అందజేశారు. నూతన తెలంగాణ యూనివర్సిటీ ఎన్.ఎస్.యు.ఐ కమిటీ అధ్యక్షుడిగా కొమిరే శ్రీశైలం ను నియమించారు. ఈ సందర్భంగా వరదబట్టు వేణు రాజ్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఎన్.ఎస్.యు.ఐ ఆధ్వర్యంలో యూనివర్సిటీ లోని సమస్యలపై పోరాడాలని, అలాగే రాష్ట్ర వ్యాప్త విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై పోరాడాలని నాయకులను సూచించారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడంతో పాటు ఎన్.ఎస్.యు.ఐ విభాగాన్ని జిల్లా స్థాయిలో బలోపేతం చేయడంలో మా వంతు గా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని, త్వరలో జరుగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆవశ్యకతను వివరించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ ల హామీలతో పాటు మేనిఫెస్టోను గ్రామ గ్రామాన ఇంటి ఇంటికి ప్రతి సామాన్య పౌరునికి తెలియజేసి కాంగ్రెస్ గెలుపుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. అనంతరం యూనివర్సిటీ నుండి కానిస్టేబుల్ ఉద్యోగం పొందిన పలువురు విద్యార్థులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఉపాధ్యక్షులు అభినయ్, మహేష్, ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, కార్యదర్శులు అనిల్ కుమార్, రాజేందర్, శ్రీకాంత్, రమేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.