నూతన కాంగ్రెస్ ముఖ్య కార్యదర్శుల నియామకం..

నవతెలంగాణ-బెజ్జంకి
కాంగ్రెస్ పార్టీ నూతన మండల ముఖ్య కార్యదర్శులుగా మండల పరిధిలోని పోతారం, కల్లెపల్లి గ్రామాలకు చెందిన లింగాల లక్ష్మన్, చెలుకల నరేందర్ రెడ్డిలను నియమించినట్టు రెండో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ తెలిపారు.మంగళవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యలయం వద్ద మండలాధ్యక్షుడు రత్నాకర్ రెడ్డి,మాజీ మండలాధ్యక్షుడు చెప్యాల శ్రీనివాస్ గౌడ్, నాయకులు మైల ప్రభాకర్, చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, రొడ్డ మల్లేశం, గూడెల్లి శ్రీకాంత్, మంకాల ప్రవీన్, మానాల రవి, దోనే వెంకటేశ్వర్ రావులతో కలిసి నూతన ప్రధాన కార్యదర్శులకు ఒగ్గు దామోదర్ నియామకపత్రమందజేశారు. మెట్ట నాగారాజు, మచ్చ కుమార్, రవి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.