టీడీపీ ఇన్‌చార్జీల నియామకం

–  ఖమ్మంలోని నాలుగు అసెంబ్లీలకు
నవతెలంగాణ-హైదరాబాద్‌
ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఖాళీగా ఉన్న నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు టీడీపీ ఇన్‌ఛార్జీలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ నియమించారు. ఈమేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గానికి కూరపాటి వెంకటేశ్వర్లు, పాలేరుకు కొండబాల కరుణాకర్‌, సత్తుపల్లికి నాయుడు రామకోటేశ్వర రావు(కోటి), వైరాకు చెరుకూరి చలపతిరావుకు నియామక ఉత్తర్వులు ఇచ్చారు.