యువజన మండల ఉపాధ్యక్షుడి నియమాకం 

నవతెలంగాణ-బెజ్జంకి: మండల పరిధిలోని దాచారం గ్రామానికి చెందిన అమరగొండ రాజు కాంగ్రెస్ పార్టీ యువజన మండల ఉపాధ్యక్షుడిగా నియమాకమయ్యారు.మంగళవారం మండల పరిధిలోని గాగీల్లపూర్ గ్రామంలో  ఎన్నికల ప్రచారంలో రాజుకు కవ్వంపల్లి సత్యనారాయణ నియమాకపత్రమందజేశారు. నాయకులు ఒగ్గు దామోదర్, రత్నాకర్ రెడ్డి, కృష్ణ, చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, రంగోని రాజు, కత్తి రమేశ్, శానగొండ శరత్, వడ్లకొండ శ్యాం తదితరులు పాల్గొన్నారు.