దిగుమతి రేట్ల పెంపునకు ఆమోదం

Approval of increase in import rates– బెవరేజేస్‌ హమాలీల చర్చలు సఫలం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
టీఎస్‌బీసీయల్‌ఐఎంఎఫ్‌ఎల్‌ డిపోస్‌ హమాలీ వర్కర్స్‌ యూనియన్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ(సీఐటీయూ, ఏఐటీయూసీ, బీఎంఎస్‌, టీఆర్‌ఎస్‌కేవీ)తో టీఎస్‌బీసీఎల్‌ అధికారుల సమక్షంలో లిక్కర్‌ అండ్‌ బీర్‌ సప్లయర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. సుదీర్ఘ చర్చల అనంతరం హమాలీ దిగుమతి రేట్ల పెంపునకు అంగీకారం జరిగింది. ఈ చర్చల్లో బేవరేజెస్‌ కార్పొరేషన్‌ జనరల్‌ మేనేజర్లు సంతోశ్‌రెడ్డి, అబ్రహం, డీసీలు, లిక్కర్‌ అండ్‌ బీర్‌ సప్లయర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కామేశ్వర్‌రావు, సత్యమూర్తి, డి.దేవస్వామి, రవికుమార్‌ పాల్గొన్నారు. జేఏసీ నుంచి హమాలీ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఐటీయూ అనుబంధం) వంగూరు రాములు, బేవరేజస్‌ హమాలీ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాలడుగు సుధాకర్‌, మర్రి ఎల్లయ్య, తిరుపతిరెడ్డి, పాండు, ఆయా డిపోల ప్రతినిధులు, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.బాలరాజ్‌, బేవరేజస్‌ హమాలీ రాష్ట్ర కార్యదర్శి శేఖర్‌, బీఎంఎస్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి నగేశ్‌, అన్ని డిపోల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.
నూతన రేట్లు ఇలా
లిక్కర్‌, బీర్‌ దిగుమతి రేట్లను రూ.5.80 నుంచి రూ.6.50పైసలకు పెంపు
ఐడిటి బీర్‌, లిక్కర్‌ కాటన్స్‌కు రూ.6.80 పైసల నుంచి రూ.7.50 పైసలకు పెంపు
ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యే మద్యానికి రూ.6.80 పైసల నుంచి రూ.7.50 పైసలకు పెంపు
లేబులింగ్‌ చార్జీలు రూ.7 నుంచి రూ.7.50నకు పెంపు
పట్టా చార్జీలు రూ.450 నుంచి రూ.500కి పెంపు
బీర్‌ బ్రేకేజ్‌ కార్టన్‌, రీప్లేస్‌మెంట్‌ కార్టన్‌కు రూ.4 నుంచి రూ.5కి పెంపు
లిక్కర్‌, బీర్‌ డ్రైనౌట్‌కు రూ.12 యథాతధం
1600 కాటన్ల పైబడిన బండ్ల పట్టా చార్జీలు రూ.1000కి పెంపు