నవతెలంగాణ- బెజ్జంకి: మానకొండూర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఆరెపల్లి మోహన్ నామినేషన్ కార్యక్రమాన్ని బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున హజరై విజయవంతం చేయాలని బీజేపీ మండలాధ్యక్షుడు కొలిపాక రాజు విజ్ఞప్తి చేశారు. మంగంళవారం మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాజు మాట్లాడారు. మానకొండూర్ నియోజకవర్గ కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా నుండి ఆరెపల్లి మోహన్ భారీ ర్యాలీతో నామినేషన్ ప్రక్రియ కార్యక్రమం చేపడుతున్నట్టు రాజు తెలిపారు. నాయకులు అనిల్ రావు, రమేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.