– నేడు సీపీఐ(ఎం) అభ్యర్ధిగా నామినేషన్
– హాజరు కానున్న జాతీయ నాయకులు సాయిబాబు
నవతెలంగాణ-అశ్వారావుపేట
విద్యార్ధి దశలోనే కమ్యూనిస్టు – మార్క్సిస్టు భావజాలం అలవర్చుకున్న పిట్టల అర్జున్ సీపీఐ(ఎం) అశ్వారావుపేట ఎమ్మెల్యే అభ్యర్ధిగా నేడు (గురువారం) నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు, ఈ నియోజక వర్గం కన్వీనర్ కొక్కెరపాటి పుల్లయ్య అధ్యక్షతన నిర్వహించే భారీ ర్యాలీ, భహిరంగ సభకు ముఖ్య అతిథులుగా పార్టీ జాతీయ నాయకులు పి.సాయి బాబు, జిల్లా కార్యదర్శి అన్నవరం కనకయ్య హాజరుకానున్నారు. 1994 లో పార్టీ అనుబంధ విద్యార్ధి సంఘం అయిన ఎస్‌ఎఫ్‌ఐలో చేరిన అర్జున్ వసతి గృహాల్లో సౌకర్యాలు, విద్యార్ధులకు కల్పించే మౌళిక సదుపాయాలు, ఉ పాధ్యాయ ఖాలీల భర్తీలు, కళాశాలల్లో మెరుగు అయిన బోధ నలపై అనేక ఆం దోళనలు, హా ర్తాల్‌లు, నిర సనలు, సమ్మెలు చేపట్టారు. ఆ రోజుల్లో నిర్వ హించిన విద్యుత్ ఆందోళనలో 100 రోజులు పాటు నిర్వ హించిన సమ్మెలో క్రియాశీలంగా వ్యవ హరించారు. సత్తుపల్లి సమీపంలో తుంబూరులో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన కార్యక్రమంలో నిరసన తెలిపిన అర్జున్‌పై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. 2001 నుండి 2010 వరకు అతి చిన్న వయస్సులోనే పార్టీ దమ్మపేట మండల కార్యదర్శి బాధ్యతలు స్వీకరించి అక్కడ పార్టీ అభివృద్ధికి కృషికి సంకల్పించారు. ఈ సమయంలోనే అనేక భూ పోరాటాలు, కూలీల వేతన పెంపు ఉద్యమాలు, పంటలకు గిట్టుబాటు ధరకు నిరసన లు, గిరిజన చట్టాలు అమలుకు, తుని కి ఆకు ధర పెంపు పై ఆందోళనలు నిర్వహించారు. 2011 నుండి నేటి వరకు కార్మిక – శ్రామిక అసంఘటిత రంగా కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్నారు. ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్నం భోజన కార్మికులు, గ్రామ దీపికాలు, కాంట్రాక్ట్ కార్మికులు, ఆయిల్ ఫాం గెలలు సేకరణ(కోత) కార్మికులు సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. కరోనా కాలంలో పార్టీ సానుభూతిపరులు, నాయకులు సహాకారంతో విరాళాలు సేకరించి అనేక పేదల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అనేక ఆందోళనలు చేపట్టారు. ఈ నేపధ్యం పిట్టల అర్జున్ ప్రాతినిధ్యం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.