శివశంకర్ కుటుంబానికి లక్ష 16 వేల ఆర్థిక సహాయం

నవతెలంగాణ – గోవిందరావుపేట
ఇటీవల ప్రమాదానికి గురై మృతి చెందిన వైద్య శాఖ సిబ్బంది శివశంకర్ కుటుంబానికి లక్ష 16 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆ శాఖ ఉద్యోగులు సోమవారం అందించారు. మండలంలో చల్వరి గ్రామానికి చెందిన శివశంకర్ సుదీర్ఘకాలంగా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేయుచున్నారు. ఇటీవల జరిగిన ఒక ప్రమాదంలో గాయపడి మృతి చెందారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పవన్ వైద్యాధికారి డాక్టర్ సుకుమార్ జిల్లా మాస్ మీడియా ఆఫీసర్ తిరుపతయ్య మరియు వైద్య సిబ్బంది ఈరోజు శివశంకర్ కర్మ సందర్భంగా వారి కుటుంబాన్ని కలిసి మనో ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది నుండి సేకరించిన విరాళాలు 1,00016 రూపాయలు మృతుడు శివశంకర్ సతీమణి పద్మ మరియు వారి కుమారులకు అందజేయడం జరిగిందని డాక్టర్ సుకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Spread the love