నవతెలంగాణ -పెద్దవంగర: ప్రముఖ వైద్య నిపుణులు, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నెమరుగొమ్ముల సుధాకర్ రావును ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ గా నియమించింది. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లను వారి చాంబర్ లో బుధవారం సుధాకర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. తన నియామకానికి కృషి చేసిన సీఎం కేసీఆర్, మంత్రులు
హరీష్ రావు, ఎర్రబెల్లి లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సుధాకర్ రావు మాట్లాడుతూ.. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక చొరవ చూపుతానని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఆరోగ్యశ్రీ సేవలను మరింత విస్తృతం చేస్తామని చెప్పారు.