– జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నవతెలంగాణ- ములుగు
ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పా ట్లను పూర్తి చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధి కారి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ తన ఛాంబర్‌లో రిటర్నింగ్ ఆఫీసర్ ఐటీడీఏ పీఓ అంకిత్‌తో కలిసి శాసన సభ ఎన్నికల నిర్వహణ పై, పోలింగ్ ముందు రోజు పోలింగ్ రోజు ఏర్పాట్లపై అధికారులతో స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… పోలింగ్ విధుల కోసం సిబ్బందిని నియమిస్తూ ఎన్నికల విధుల పట్ల వారికి పూర్తి అవగాహన కల్పించాలన్నా రు. పోలింగ్ సామాగ్రిని సిద్ధం చేసుకోవాలని మార్గనిర్ధేశం చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో టాయిలెట్స్, ర్యాంపులు, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను పరిశీలించా లని, ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే తక్షణమే సౌకర్యాలను అందుబాటులోకి తేవాలని సూ చించారు. ఎన్నికల రోజు సిబ్బంది పోలింగ్ కేంద్రాలలో బస చేయుటకు అనుకూలంగా అన్ని ఏర్పాట్లు చేయలన్నారు. ఎన్నికల నిర్వహ ణకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసుకో వాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్(లోకల్ బాడీ) డీిఎస్ వెంకన్న, ఆర్డ్డీఓ కే సత్యపాల్ రెడ్డి, డీఆర్డీఓ నాగ పద్మజ, సీఈఓ ప్రసూనరాణి, డీపీఓ వెంకయ్య, కలెక్టరేట్ ఏవోప్రసాద్, ము లుగు తహసీల్ధార్ విజయభాస్కర్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం తహసీల్ధార్ సంధ్యారాణి, ఏపీడీ, ఎంపీడీవోలు, ఎన్నికల సిబ్బంది విజ రుకుమార్, అనిస్ ఫాతిమా పాల్గొన్నారు.