
ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన సైబర్ నేరస్థులను అరెస్టు చేసినట్లు కాజీపేట ఏసిపి డేవిడ్ రాజ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సీఐ కె శ్రీధర్ రావు వారు తెలిపిన వివరాల మండలంలోని విలీన గ్రామమైన రాంపూర్ గ్రామానికి చెందిన బాకడి సుష్మా, భర్త రాంబాబు గుర్తుతెలియ వ్యక్తి నుండి జూన్ నెలలో వాట్సప్ మెసేజ్ లో కాంట్రాక్ట్ పద్దతిలో కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మపలుకుతారు. అది పూర్తిగా నమ్మిన సుష్మా అతనికి రెండు, మూడు ధపహాలుగా సుమారు 99,000/- రూపాయలను గుర్తు తెలియని వ్యక్తికి ఫోన్ పే చేస్తారు. ఆ తర్వాత సదరు గుర్తు తెలియని వ్యక్తి ఎలాంటి స్పందన లేకపోవడం తో, సుష్మాతాను మోసపోయానని గమనించి, ఈ విషయంపై సైబర్ సెల్ 1930 కి కాల్ చేసి పిర్యాదు చేయడం జరుగుతుందని ఆరోపించారు. హుటాహుటిన ఈ విషయంపై సైబర్ క్రైమ్ వారి ఆదేశానుసారం 14-07-2023 రోజున ధర్మసాగర్ పోలీస్ వారు గుర్తు తెలియని వ్యక్తి పై 420, 66-D ఐటి ఆక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించడం జరుగుతుంది.ఈ క్రమంలో ధర్మసాగర్ పోలీస్ వారు కాంట్రాక్ట్ పద్దతిలో కోర్టు లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసిన వ్యక్తి నూనె సంతోష్, తండ్రి కుమారస్వామి, ముధీరాజ్, నివాసం ఎలాబొత్తారామ్ గ్రామం, సైదాపూర్ మండలము, కరీంనగర్ జిల్లా గా గుర్తించి,వారిని అదుపులోకి తీసుకొని విచారించగా, తాను తనతో పాటు అతని భార్య నూనె మమత, మరియు స్నేహితులు జమ్మికుంట మండలానికి చెందిన వడ్లురి కిషోర్, సమ్మెట. సాయి, సమ్మెట. రాజేశ్ తండ్రి:కొమురయ్య, వారి సహాయం తో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇంటర్నెట్ ద్వారా ప్రజలను నమ్మయిస్తూ డబ్బులు వసూలు చేస్తామని చెప్పారు, పై వ్యక్తులపై ధర్మసాగర్, సిద్దిపేట, మాధాపూర్, రాజేంద్ర నగర్, నేరేడ్ మెట్, సుబేదారీ, పర్వతగిరి పోలీస్ స్టేషన్ లలో పలు కేసులు నమోదు చేశామని తెలిపారు. ఇప్పటి వరకు వీరు సుమారు 1,87,00,000/- వసూలు చేయగా, వీరి వద్ద నుండి కేవలం 1,00,000/-రికవరీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా కే.శ్రీధర్ రావు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ధర్మసాగర్ అరెస్ట్ చేసి నిందితులు అందరినీ జుడీష్యల్ కస్టడీ నిమిత్తం కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.ప్రజలందరూ ఇలాంటి సైబర్ నెరస్థుల మోసలకి గురికావద్దుని సూచిస్తూ, ఎలాంటి సైబర్ మోసాలు/నేరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1930 ను ప్రజలు ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఈ సమావేశంలో కాజిపేట్ ఏసిపి డేవిడ్ రాజ్, సీఐ కే. శ్రీధర్ రావు, ఎస్సైలు బి. రాజు పి.ఫిలిప్ రాజు, మరియు సిబ్బంది పాల్గొన్నారు.