పేకాటరాయుల అరెస్ట్‌

– ఆరుగురు నిందితుల అరెస్టు
– నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం
నవతెలంగాణ-కొడంగల్‌
పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన మండల పరిధిలోని అంగడి రైచూర్‌ గ్రా మంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై రవి గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని అంగడి రైచూరు గ్రామంలో బిందు మాధవరావు కోటలో 06 మం ది పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు తనకి నిర్వ హించగా 06 మంది పేక ఆడుతూ పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి రూ.16,180 నగదు, 06 మొబైల్‌ ఫోన్‌లు స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి కేసు నమోదు చేశామన్నా రు. ఈ సందర్భంగా ఎస్సై రవి గౌడ్‌ మాట్లాడుతూ అసాం ఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఊపేక్షించేది లేదని, వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా పేక ఆడితే సమాచారమందించాలని గ్రామస్తులను కోరారు.