పేకాటరాయుళ్ల అరెస్టు

నవతెలంగాణ-వీణవంక
మండలంలోని చల్లూరు గ్రామంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పట్టుకున్నట్లు వీణవంక ఎస్సై ఎండీ ఆసీఫ్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. చల్లూరు గ్రామంలోని డంపింగ్ యార్డు వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో ఆరుగురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారు. పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి ఆరుగురిని పట్టుకుని, వారి వద్ద ఉన్న నగదు రూ.5500, పేక ముక్కలను స్వాధీనపరుచుకున్నట్లు పేర్కొన్నారు.