– డిపిఅర్‌ఓ వంగరి శ్రీధర్
నవతెలంగాణ-భూపాలపల్లి
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ ఎలక్ట్రోర్రల్ పాటిస్పేషన్ (స్వీప్) కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు వినియోగంపై, ప్రతి ఒక్కరికి తమ ఓటు విలువను తెలిపే విధంగా, గ్రామీణ పట్టణ ప్రాంత ఓటర్లకు చైతన్యం కల్పించడానికి 10-10-2 023 నుండి జిల్లా కలెక్టర్, స్వీప్ నోడల్ అధికారి జెడ్పీ సీఈవో ఆదేశాల మేరకు తెలంగాణ సాంస్కతిక సారథి కలకారులు రెండు టీం లచే నిర్వహిస్తున్నట్టు డీపీఆర్‌ఓ వి శ్రీధర్ తెలిపారు. మంగళవారం భూపాలపల్లి మండలం రాజీవ్ నగర్,మొగుళ్ళపల్లి మండలం గణేష్ పల్లి గ్రామాలలో కళా ప్రదర్శనతో ప్రజలకు అవగాహన కల్పించారు. రాష్ట్రంలో జరగబోయే సాదారణ అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఓటర్లు విధిగా తమ ఓటు హక్కు విని యోగించుకొని రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలని అవగాహన పెంపొందిస్తున్నారని శ్రీధర్ తెలిపారు. ఈ కార్య క్రమంలో తెలంగాణ సాంస్కతిక సారథి కళాకారులు ప్రవీణ్ కుమార్, మహేందర్, రవి, ఎండి ఖలీల్ పాషా, స్వప్న, శ్యామల, రజిత, మౌనిక, రాధిక, సుమలత పాల్గొన్నారు.