ఎఎస్‌బీఏ స్పాన్సర్‌గా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

ఎఎస్‌బీఏ స్పాన్సర్‌గా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ముంబయి : సెకండరీ మార్కెట్‌లో ఎఎస్‌బిఎకు సదుపాయాన్ని కల్పించేందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ స్పాన్సర్‌, డెస్టినేషన్‌ బ్యాంక్‌గా వ్యవహరించనున్నట్లు ఆ విత్త సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. నగదు, ఈక్విటీ డెరివేటివ్స్‌ విభాగాలలో ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలకు ప్రముఖ క్లియరింగ్‌ , సెటిల్‌మెంట్‌ బ్యాంక్‌గా ఉన్న తాము జనవరి 01 నుంచి ఇండియన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో సెకెండరీ మార్కెట్లలో బ్లాక్‌ చేయబడిన మొత్తానికి మద్దతు ఇచ్చే ట్రేడింగ్‌కు స్పాన్సర్‌, డెస్టినేషన్‌ బ్యాంక్‌గా వ్యవహరించనున్నట్టు తెలిపింది.