కళ్ళకు గంతలతో ఆశాల వినూత్నంగా నిరసన

– ఏడవ రోజుకు చేరిన ఆశల సమ్మె
– నెలకు 18వేల ఫిక్స్డ్‌ వేతనం ఇవ్వాలి
– ఎస్‌ఐపిఎఫ్‌ సౌకర్యం కల్పించాలి
నవ తెలంగాణ మహబూబ్‌ నగర్‌
ఆశ వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చేపట్టిన సమ్మె 7వ రోజు చేరిన సందర్భంగా కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఆదివారం టీటీడీ కళ్యాణమండపం దగ్గర టౌను ఆశ వర్కర్లు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి చంద్రకాంత్‌ మాట్లాడుతూ నెలకు 18000 ఫిక్స్డ్‌ వేతనం ఇవ్వాలని, ఎస్‌ఐపిఎఫ్‌ సౌకర్యం కల్పించాలని, ప్రకారం వేతనం నిర్ణయించాలని కోరారు. సీఎం కేసీఆర్‌ గతంలో ఆశ వర్కర్లకు మోసం చేశాడని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ల జిల్లా కార్యదర్శి సాధన, భాగ్య ,మహాలక్ష్మి ,సౌజన్య ,మహాలక్ష్మి ,మల్లేశ్వరి, చంద్రలేఖ పద్మ, యాదమ్మ ,తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్ల: ఆశా కార్యకర్తల నిరవధిక సమ్మె సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ చౌరస్తాలో కళ్ళకు గంతలతో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి టి.సత్తయ్య, జిల్లా సీనియర్‌ నాయకులు భాగీ కష్ణయ్య, శివ లీల, నర్సమ్మ, సుగుణ, సునీత, శ్రీదేవి, మయూరి, సునీత, ప్రభావతి, జయలక్ష్మి, సమంత, ఇంద్ర,శ్యామల, సుధారాణి, మహేశ్వరి ,కవిత,జయమ్మ, మేఘమాల పాల్గొన్నారు.
హన్వాడ : మండల కేంద్రంలోని తాసిల్దార్‌ కార్యాలయం ముందు చేపట్టిన ఆశల సమ్మె ఏడవ రోజుకు చేరింది వారు కండ్ల గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఆశ కార్యకర్తల అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మీ విజయలక్ష్మి , ఆశ వర్కర్ల యూనియన్‌ సభ్యులు పాల్గొన్నారు.