సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు తహసీల్దార్ కు వినతి పత్రం

నవతెలంగాణ – జుక్కల్

ఆశా వర్కర్ల న్యాయమైన పదకొండు డిమాండ్లు,  వేతనాలు పెంచాలని కోరుతు శనివారం నాడు సిఐటీయూ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు బైటాయించి దర్నా నిర్వహించారు. ఈ సంధర్భంగా సిఐటీయూ నాయకుడు సురేష్ గొండ మాట్లాడుతు ఆశా వర్కర్లకు నెలకు సమాన పనికి సమాన  వేతనం పద్దేనిమిది వేల రూపాయలు ఇవ్వాలని, పీఎఫ్ ఇఎస్ఐ సౌకర్యంతో పాటు తమ పదకొండు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ గంగాప్రాసద్ కు అందించారు. అంతకు ముందు తహసీల్దార్ కార్యలయం ముందు బైటాయించి దర్నా చేసి నిరసనను తెలిపారు కార్యక్రమంలో  సిఐటీయూ  నాయకుడు సురేష్ గొండ, మండలంలోని ఆశాలు తదితరులు పాల్గోన్నారు.