బిక్షటన చేస్తున్న ఆశా వర్కర్లు..

నవతెలంగాణ- రెంజల్
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత పది రోజులుగా సమ్మె చేస్తున్న ఇంతవరకు ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని ఆశ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రెంజల్ మండల కేంద్రంలో ఆశలు బిక్షటన చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, హోటల్లు, అధికారులు ప్రజాప్రతినిధుల వద్ద బిక్షటన చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు 18 వేల రూపాయల గౌరవేతనాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లావణ్య, కవిత, రేవతి, నాజియా, అజ్మీర, శారద, శ్యామల, సావిత్రి, సువర్ణ, గంగ మణి, పావని, భాగ్య, స్రవంతి, తదితరులు పాల్గొన్నారు.