వాహనల తనిఖీలు నిర్వహిస్తున్న ఏఎస్ఐ రాములు

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
మండలంలోని జాతీయ రహదారి పోచారం తండా గేటు వద్ద బుధువరం నాడు ఏ.ఎస్.ఐ రాములు వాహనాలను తనిఖీ నిర్వహించారు.వాహనదారులు తప్పని సరిగా వాహనం పై ప్రయాణం చేసేటప్పుడు  హెల్మెట్లు ధరించాలని సూచించారు. దాంతో పాటు వాహనాల ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని తెలిపారు.హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం ప్రాణంతో చేలాగడటంతో సమానం అని అన్నారు.హెల్మెట్ ధరించడం వల్ల వాహనదారులు సురక్షితంగా తమ గమ్యాన్ని చేరుకుంటారని అన్నారు.వాహన దారులు పాత చాలాన్ లను తప్పని సరిగా కట్టుకోవలని ఆదేశించారు. జాతీయ రహదారిపై ప్రయాణం చేస్తున్నపుడు అతి వేగం తో వాహనాన్ని నడపరదాని తెలిపారు.తనిఖీలో ఏ.ఎస్.ఐ రాములు,పోలీసు సిభందులు ఉన్నారు.