ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెల్పిన ఆసిఫ్ అలీ

నవతెలంగాణ-ఆమనగల్
  ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి రేవంత్ మిత్ర మండలి వ్యవస్థాపక అధ్యక్షులు ఆసిఫ్ అలీ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ విజయఢంకా మోగించడంతో పాటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆదివారం హైదరాబాద్ లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపినట్టు రేవంత్ మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షులు ఆసిఫ్ అలీ తెలిపారు.