ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెల్పిన ఆసిఫ్ అలీ

నవతెలంగాణ-ఆమనగల్
  రేవంత్ మిత్ర మండలి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ఆసిఫ్ అలీ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి పూల మాలలు శాలువాలతో ఘనంగా సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెల్పినట్టు ఆసిఫ్ అలీ తెలిపారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచిన అన్ని సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని, ఆదిశగా ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని ముఖ్యమంత్రి అన్నారని ఆయన అన్నారు. అదేవిధంగా పార్టీకోసం పనిచేసిన వారిని అధిష్టానం తప్పక గుర్తిస్తుందని ఈసందర్భంగా ముఖ్యమంత్రి తెల్పినట్టు ఆయన చెప్పుకొచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కష్టపడి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా కృషి చేయాలని రేవంత్ రెడ్డి సూచించినట్టు ఆసిఫ్ అలీ పేర్కొన్నారు.