ఆశ లకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం ఇవ్వాలి. 

– బాన్సువాడ లో ఆందోళన..
– సిఐటియు డిమాండ్
నవతెలంగాణ- నసురుల్లాబాద్ (బాన్సువాడ)
ఆశల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో  ఆశ కార్యకర్తలు శనివారం బాన్సువాడ పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సదర్భంగా  సీఐటీయూ నాయకులు రవీందర్, కలిల్  మా ట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశ కార్యకర్తల సమస్యల పరిష్కారంలో విఫలమయ్యాయన్నారు. ఆశలకు కనీస వేతనం ఇవ్వాలని, పనికి తగిన పారితోషికం అంటూ  ఇతర పనులు  చేయించడం వంటి పనులు చేయించడం సిగ్గుచేటు అన్నారు. 45వ లేబర్‌ కాన్ఫరెన్స్‌ సిఫారసు మేరకు ఆశలను కార్మికులుగా గుర్తించి ఉద్యోగ భద్రత, 18 వేల కనీస వేతనం,  పీఎఫ్‌, ఈఎస్‌ఐ వంటి చట్టబద్ధత సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఆశ కార్యకర్తలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడం లేదన్నారు. ఉద్యోగ భద్రత కల్పించక పోవడం సిగ్గుచేటు అని అన్నారు.18 సంవత్సరాలుగా పనిచేస్తున్న కనీస వేతనం అమలుకు నోచుకోవడం లేదన్నారు.  వెంటనే ప్రభుత్వాలు గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో ఆశ కార్యకర్తల  యూనియన్ రాష్ట్ర నాయకులు లావణ్య, సుమలత, పల్లవి,  పద్మ తదితరులు పాల్గొన్నారు.