కందనూలు: జిల్లాస్థాయి ఎన్నికల నోడల్ అధికారులు పూర్తి అవగాహనతో విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి ఉదరు కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, అంచనాలు, మానిటరింగ్ కమిటీ, స్వీప్, పోస్టల్ బ్యాలెట్, మ్యాన్ పవర్, ట్రైనింగ్ నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ….. జిల్లా స్థాయి నోడల్ అధికారులు చేస్తున్న పనులు, నిర్వహిస్తున్న వివరాలపై సమీక్షించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా నోడల్ అధికారులు పకడ్బందీగా విధులు నిర్వహించాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థి రూ.40లక్షలకు మించి ఖర్చు చేయరాదని ఎన్నికల సంఘం పరిమితి విధించినట్టు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు కుమార్ దీపక్, సీతారామారావు, నోడల్ అధికారులు నర్సింగ్ రావు, ఉష, పత్యా నాయక్, శ్రీనివాసులు, శ్రీనివాస్ బాబు, రమాదేవి, ఫయాజుద్దీన్, రిటర్నింగ్ అధికారులు వెంకట్ రెడ్డి, గోపిరామ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామ్ రెడ్డి, జాకీర్ అలీ, కార్తీక్, చంద్రశేఖర్, ఎం సి ఎం సి కమిటీ సభ్యులు శ్రీధర్, దినకర్, తిరుపతయ్య, గురుబ్రహ్మం, శ్రీకర్, తదితరులు పాల్గొన్నారు.
సి విజిల్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి
ఎన్నికలు పారదర్శకంగా జరగడానికి ప్రజల చేతిలో సి విజిల్ యాప్ ను సద్వినియోగం చేసు కోవాలని జిల్లా కలెక్టర్ పి ఉదరు కుమార్ నేడోక ప్రకటన లో తెలిపారు. జిల్లాలో ఎక్కడ ఓటరుకు ప్రల ోభాలు పెట్టినా, ఓటరును భయబ్రాంతులకు గురి చేసిన లేదా బలవంతంగా ప్రభావితం చేసిన సి విజిల్ యాప్ ద్వారా ఎవరైనా సరే సమాచారం ఇవ్వొచ్చు. ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లో సమస్యను పరిష్కరించడం జరుగుతుందన్నారు. అందుకే ఎలక్షన్ కమిషన్ ప్రజల చేతిలో సి విజిల్ అనే బ్రహ్మాస్త్రం పెట్టిందన్నారు. ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న ఎవరైనా సరే సివిజిల్ యాప్ ను ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నారు.