నేటి నుంచి అసెంబ్లీ

Assembly from today– ఉదయం 11.30 గంటలకు ఉభయసభలు ప్రారంభం
– సభ ముందుకు పలు బిల్లులు
  కీలక నిర్ణయాలు ప్రకటించనున్న సీఎం కేసీఆర్‌
–  ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు విపక్షాల వ్యూహం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉభయ సభలు ఉదయం 11.30 గంటలకు సమావేశమవుతాయి. ఎన్నికలకు ముందు జరుగుతున్న చివరి సమావేశాలు కావడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఈ సెషన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. రాజకీయంగా మైలేజ్‌ కోసం అసెంబ్లీ సమావేశాలను ఉపయోగించుకో వాలని చూస్తున్నాయి. సంక్షేమ, అభివృద్ధి పథకాలను మరింతగా ప్రచారం చేసుకునేందుకు అధికార పక్షం ఈ అసెంబ్లీ సమావేశాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోనుంది. సంక్షేమ పథకాలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో కీలక ప్రకటన చేయనున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ భవిష్యత్‌ లక్ష్యాలు, ప్రణాళికలను సభా వేదికగా సీఎం ప్రజలకు వెల్లడించే అవకాశముంది. అదేసమయంలో, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రతిపక్షాలు వ్యూహాత్మకంగా వ్యవహరించనున్నాయి.
ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. గత సమావేశాల్లో సభ ఆమోదం పొందిన తెలంగాణ రాష్ట్ర ప్రయివేటు యూనివర్సిటీల సవరణ బిల్లు 2022, తెలంగాణ రాష్ట్ర మున్సిపల్‌ చట్ట సవరణ బిల్లు 2022, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లు 2023 బిల్లులను గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ తిరస్కరించారు. ఈ మూడు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి సభలో ప్రవేశపెట్టనుంది. ఈసారి సభ ఆమోదంతో గవర్నర్‌ అనుమతి లేకుండానే ఆ మూడు బిల్లులకు చట్టబద్దతరా నుంది. టీఎస్‌ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వ ఉగ్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, తదనుగుణంగా బిల్లును ప్రభుత్వం సభ ముందుంచనుంది. ఇటీవల మృతిచెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే సాయన్నకు శాసనసభ సంతాపం ప్రకటించనుంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక
నేటి నుంచి అసెంబ్లీ చెల్లదంటూ సమీప ప్రత్యర్ధి జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా హైకోర్టు తీర్పు ప్రకటించిన నేపథ్యంలో సభకు ఎవరు హాజరవుతారనే గందరగోళం నెలకొంది. ఈ సారి సమావేశాలను నెలరోజుల పాటు నిర్వహించాలని ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయి. దీనిపై స్పీకర్‌ అధ్యక్షతన జరిగే శాసనభా వ్యవహారాల కమిటీ (బీఏసీ)లో స్పష్టతరానుంది.