అసెంబ్లీ తీర్మానాన్ని

రద్దు చేయకపోతే ప్రజా ఉద్యమం
ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముట్టడి
నవతెలంగాణ-మణుగూరు
ఎస్టీ జాబితాలలో నుండి 11 బీసీ కులాలను కలిపి అసెంబ్లీ తీర్మానాన్ని రద్దు చేయాలని జాతీయ ఆదివాసి సంఘాల జేఏసీ డిమాండ్‌ చేసింది. గురువారం పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీ తీర్మానాన్ని వెనకకు తీసుకోకపోతే గ్రామీణ స్థాయిలో ఉద్యమాలను బలోపేతం చేస్తామన్నారు. ప్రజల సహకారంతో క్రియాశీలక పోరాటం నిర్వహిస్తామన్నారు. రద్దు చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక జిల్లా కన్వీనర్‌ వాసం రామకృష్ణ, నాయకులు గోగెల రామకృష్ణ, వజ్జా నరసింహారావు, కొమరం కాంతారావు, దుబ్బా గోవర్ధన్‌, మడివి రమేష్‌, వర్ష శ్రీను, సిద్ధ బోయిన శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.