ఉద్యమకారులకు అసెంబ్లీ టికెట్‌ ఇవ్వాలి

 Assembly ticket should be given to the activists– టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు పొనుగోటి రవీందర్‌ రావు, రమేష్‌ గౌడ్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌
ఉద్యమ నాయకుడు, బడు గు, బలహీన వర్గాల ఆశా జ్యోతి, బీసీ నేత, నాగర్‌ కర్నూల్‌ జడ్పీ వైస్‌ చైర్మెన్‌ బాలాజీకి ఈసారి కల్వకుర్తి ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు పోనుగోటి రవీందర్‌రావు, రమేష్‌ గౌడ్‌ సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ సందర్భంగా మంగళవారం వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మలిదశ తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో కల్వకుర్తి నియోజకవర్గంలో ఎన్నో ఆటుపోట్లు అవమానాలు ఎదుర్కొన్నా భయపడకుండా నియోజకవర్గ వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమాన్ని, టీఆర్‌ఎస్‌ పార్టీ జెండాను ఆయన ప్రతి గడపకు తీసుకెళ్లి ఉద్యమాన్ని నడిపించారని అన్నారు. ఇప్పటికీ ఉద్యమకారులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని విధాల ఆదుకుంటూ బీఆర్‌ఎస్‌ అధిష్టానం ఆదేశాల ప్రకారం పార్టీ కోసం నిరంతరం పని చేస్తున్నారని తెలిపారు. నాగర్‌ కర్నూల్‌ జడ్పీ వైస్‌ చైర్మెన్‌ బాలాజీకి కల్వకుర్తి ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తే కల్వకుర్తిలో గులాబీ జెండా ఎగరేసి కేసీఆర్‌కు కానుకగా, అసెంబ్లీకి పంపించే బాధ్యత తీసుకొని పనిచేస్తామని నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజా ప్రతినిధులు, ఉద్యమకారులు, పార్టీ నాయకులు ముక్తకంఠంతో నినదిస్తున్నారన్నారు. ఇప్పటికైనా అధిష్టానం గుర్తించి ఉద్యమకారునికి ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమం లో బీఆర్‌ఎస్‌ నాగర్‌ కర్నూల్‌ జిల్లా నాయకులు, కల్వకుర్తి నియోజకవర్గ గొర్రెల కాపరుల సంఘం నాయకులు కాలె వెంకటేష్‌ కురుమ (కేవీకే), రావిచేడ్‌ గ్రామ బీఆర్‌ఎస్‌ నాయకులు మొబీన్‌ పాల్గొన్నారు.