వామ పక్ష విద్యార్థి సంఘాల దాడి చేయడం హేయమైన చర్య..

– ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం దిష్టిబొమ్మ దగ్ధం

– ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పై క్రిమినల్ కేసులు పెట్టి సీజ్ చేయాలి
నవతెలంగాణ- కంటేశ్వర్
ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో బోన్సాగర్ తో వామపక్ష విద్యార్థి సంఘాలపై దాడి చేయడం ఏమైనా చర్య అని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం కేసులు పెట్టి సీజ్ చేయాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంతో పటు  వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో ఢిల్లీ పబ్లిక్ హై స్కూల్ (ఖమ్మం) మరియు రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ ఢిల్లీ పబ్లిక్ హై స్కూల్లో శాంతియుతంగా బందు చేయాలని అడిగితే ఎస్ఎఫ్ఐ, పిడిఎస్ యు సినాయకులపై భౌతిక దాడులు చేయడాన్ని నిరసిస్తూ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అదే విధంగా ఢిల్లీ పబ్లిక్ యాజమాన్యం విద్యార్థి సంఘాల నాయకులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అకారణంగా అరెస్ట్ లు పిరికి పందా చర్య అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు విఘ్నేష్, అనిల్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అంజలి, రఘురాం, పిడిఎస్యు జిల్లా కార్యదర్శి గణేష్, ఐపీఎస్యు జిల్లా కార్యదర్శి జ్వాలా, ఏఐఎస్బి రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేష్ రెడ్డి, ఏఐఎఫ్బిఎస్ జాతీయ కన్వీనర్ రాజశేఖర్ ఏఐపీఎస్యు రాష్ట్ర కార్యదర్శి కిరణ్ విద్యార్థి సంఘం జిల్లా నాయకులు మహేష్, అషుర్, సుచిత్ర, గోపాల్, అసిఫ్, తదితర నాయకులు పాల్గొన్నారు.